17, ఆగస్టు 2011, బుధవారం

నీఎదుట నేను(తేనెమనసులు)చందమామా ..అందాలమామా..
నీ ఎదుట నేను
వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు

నీ ఎదుట నేను
వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు

పెళ్ళిచూపులకు వారొచ్చారు
చూడాలని నే వోరగ చూసా
పెళ్ళిచూపులకు వారొచ్చారు
చూడాలని నే వోరగ చూసా
వల్లమాలిన సిగ్గొచింది
కన్నుల దాకా
కన్నులుపోక
మగసిరి ఎడదని చూసాను
మగసిరి ఎడదని చూసాను
తలదాచుకొనుటకది చాలన్నాను... !!నీ !!పెళ్ళిచూపులలో బిగుసుకొని పేరేమి
చదువేమి ప్రేమిస్తావా వయసెంత
పెళ్ళిచూపులలో బిగుసుకొని నీ పేరేమి
చదువేమి నను ప్రేమిస్తావా వయసెంత
అని అడిగారా ..అసలొచ్చారా

నాలో వారు ఏం చూసారో నావారైయారు
నాలో వారు ఏం చూసారో నావారైయారు
అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంటా.. !! నీ !!

చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరి వంటారు
చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరి వంటారు
ఆ వెన్నెలలోని వేడి గాడ్పులు
నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను
అనుభవించి అనమంటాను
వయసుకు వైరివి నీవంటాను..!!నీ!!

చందమామా ..అందాల మామా...

కామెంట్‌లు లేవు: