రొమాంటిక్ పాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రొమాంటిక్ పాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, మే 2010, శుక్రవారం

యమునా ఎందుకే నీవూ(నీరిక్షణ)

ఈ పాట ఇష్టపడనివారు ఎవరు ఉంటారు :)


హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చూ
కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ (2)
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
దారివ్వకే చుట్టూ తారాడుతాడే

పిల్లా పోనివ్వనంటూ చల్లా తాగేస్తడే
అల్లారల్లరివాడు..అబ్బో ఏం పిల్లడే..

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే..
శృంగార రంగాన కడతేరినాడే (2)
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
ఈ రాధకీడైన జతగాడు వాడే

మురళీలోలుడు వాడే..ముద్దూ గోపాలుడే
వలపే దోచేసినాడే..చిలిపీ శ్రీకృష్ణుడూ..

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా

ప్రేమలేఖ రాసా(ముత్యమంత ముద్దు )

ఈ సినిమా అబ్బో చాలా బాగా నచ్చేసింది. మిగిలిన పాటలు గుర్తులేవుకాని ఈ పాట మాత్రం బాగా ఇష్టం




ప్రేమలేఖ రాసా నీకందిఉంటది
పూలబాణమేసా యెదకందిఉంటది
నీటి వెన్నెల వేడెక్కుతున్నది
పిల్లగాలికే పిచ్చెక్కుతున్నది
మాఘమాసమా వేడెక్కుతున్నది
మల్లెగాలికే వెర్రీక్కుతుంది
వస్తే గిస్తే వలచి వందనాలు చేసుకుంటా

హంసలేఖ పంపా నీకంది ఉంటది
పూలపక్క వేసా అది వేచి ఉంటది

ఆడసొగసు ఎక్కడుందో చెప్పనా
అందమైన పొడుపుకధలు విప్పనా
కోడెగాడి మనసు తీరు చెప్పనా
కొంగుచాటు క్రిష్ణలీలలు విప్పనా
సత్యభామ అలకలన్ని పలకరింతలే అన్నాడు ముక్కు తిమ్మనా
మల్లెతోటకాడ ఎన్ని రాసలీలలో అన్నాడు భక్త పోతన
వలచివస్తినే వసంత మాడవే
సరసమాడినా క్షమించలేనురా
క్రిష్ణా గోదారుల్లో ఏది బెస్టొ చెప్పమంట

మాఘమాస వెన్నెలెంత వెచ్చన
మంచివాడవైతే నిన్ను మెచ్చనా
పంట కెదుగుతున్న పైరు పచ్చన
పైటకొంగు జారకుండా నిలుచునా
సినిమా కధలు వింటే చిత్తుకానులే చాలించు నీ కధాకళీ
అడవారిమాటలకు అర్ధాలు వేరులే అన్నాడు గ్రేటు పింగళి
అష్టపదులతో అలాగా కొట్టకు
ఇష్టసఖివని ఇలాగే వస్తినే
నుయ్యోగొయ్యో ఏదో అడ్డదారి చూసుకుంట..

18, ఏప్రిల్ 2010, ఆదివారం

బొమ్మను గీస్తే(బొమ్మరిల్లు)

ఈ మద్య కాలం లో నాకు బాగా నచ్చిన సాంగ్ ఇది ..మీనింగ్ కూడా చాలా బాగుంటుంది


బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది

చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ
శ్రమ పడిపోకండి తమ సాయం ఉందంది
పొమ్మంతావే బాలికా ఉంటానంటే తోడుగా
అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా
యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది
నీ వైపే నన్నే లాగింది


అందంగా ఉంది తన వెంటే పదిమంది
పడకుండా చూడు అని నా మనసంటుంది
తమకే తెలియంది నా తోడై ఒకటుంది
మరెవరో కాదండి నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది
నా మనసు యెన్నో కలలు కంటుంది


బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది

కురిసేను విరుజల్లులే(ఘర్షణ)

ఈ పాట మణిరత్నం సినిమా ఘర్షణ లోనిది .. రొమాంటిక్ పాటలు ఆయన సినిమా లోనే చూడాలనిపించేలా తీస్తారు అతను...ఆ లైటింగ్ , ఆహ్లాదం ,చల్ల గాలి.. కెమెరామెన్ టాలెంట్ ఏమిటో తెలుస్తుంది ..


కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకివే శ్రీకారమే కావె
కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే
ఆకుల పై రాలు ఆ..
ఆకుల పై రాలు హిమబిందువువోలే
నా చెలి ఒడిలోన పవళించనా (2)
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాని యద చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళం
నీవు నాకు వేద నాదం
కురిసేను విరిజల్లులే (||)
కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు
వన్నెల మురిపాల కథ ఏమిటో
తలపుల మాటల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కళలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరి వాన
మధురిమలు అందించు సుధలేమిటో
పరవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహబంధం
ఆలపించే రాగబంధం
కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకివే శ్రీకారమే కావె
కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే

13, ఏప్రిల్ 2010, మంగళవారం

కన్నుల్లో నీ రూపమే(నిన్నేపెళ్ళడుతా)

ఈ పాట నేను ,మావారు పెళ్ళయ్యాకా మొదటి సారి అత్తగారి ఇంటికి వెళుతున్నపుడు డ్రైవర్ పెట్టాడు.. ఇద్దరం కలిసి విన్న మొదటి పాట ఇది.. అందుకేనేమో ఈ పాట వింటే చాలా హాయి గా ఉంటుంది మనసుకు ...


కన్నుల్లో నీ రూపమే.....గుండెల్లో నీ ధ్యానమే ...
నా ఆశ నీ
స్నేహమే....నా
శ్వాస నీ కోసమే....
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే
..

కన్నుల్లో
నీ రూపమే....గుండెల్లో నీ ధ్యానమే....
నా ఆశ నీ
స్నేహమే....నా
శ్వాస నీ కోసమే....

మది దాచుకున్న రహస్యాన్ని
అడిగేటి
నీ
చూపునాపెదెల...
నీ నీలి కన్నులో పడి
మునకలేస్తున్న నా మనసు
తెలిపేదెల......
గిలిగింత
పెడుతున్న నీ
చిలిపి తలపులతో ఏమో ఎలా
వేగడం....

కన్నుల్లో
నీ రూపమే....గుండెల్లో నీ ధ్యానమే....
నా ఆశ
నీ స్నేహమే....నా శ్వాస
నీ కోసమే....

అదిరేటి పెదవులను
బ్రతిమాలుతున్నాను మది లోని
మాటేదని....
తల వంచుకుని నేను తెగ ఎదురు
చూసాను
నీ తెగువ
చూడాలని.....
చూస్తూనే రేయంత తేలవారిపోతుంది ఏమో ఎలా ఆపడం..

కన్నుల్లో

నీ రూపమే.....గుండెల్లో నీ ధ్యానమే ...
నా ఆశ నీ స్నేహమే....నా శ్వాస
నీ
కోసమే....
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే ..

కన్నుల్లో
నీ
రూపమే....గుండెల్లో నీ ధ్యానమే....
నా ఆశ నీ స్నేహమే....నా శ్వాస నీ
కోసమే....||