15, నవంబర్ 2011, మంగళవారం

ఓ రంగయో పూలరంగయోఓ రంగయో పూలరంగయో
ఓరచూపు చాలించి సాగిపోవయో
పొద్దు వాలిపోతున్నదోయి
ఇంత మొద్దు నడక నీ కేందుకోయి

చరణం 1
పగలనక రేయనక పడుతున్న శ్రమనంతా
పరులకొరకు ధారపోయు మూగజీవులు
ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి
ఆనందం పొందగలుగు ధన్యజీవులు

చరణం 2
కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని
ఈ దీనుల జీవితాలు మారుటెన్నడో
కలవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి
కనిపెట్టి మేలు చేయ గలిగినప్పుడే

ఓ రంగయో పూల రంగయో
ఓర చూపు చాలించి సాగిపొవయో
పొద్దువాలిపోతున్నదోయి
ఇంత మొద్దునడక నీకెందుకోయి ||ఓ రంగయో||

1 కామెంట్‌:

'''నేస్తం... చెప్పారు...

Manchi paatalanni oka daggara pedthunna meeru super.. :)