8, మార్చి 2011, మంగళవారం

ఔరా అమ్మకచెల్ల



అమ్మలాలపైడి కొమ్మలాల ఏడి ఏవయ్యాడు జాడలేడియ్యాల కోటితందనాల ఆ నందలాల
గోవులాల పిల్లంగోవులాల గొల్లభామలాల యేడనుంది ఆలనాటి నందనాల ఆనందలీల

ఔరా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల
రేపల్లె వాడల్లో ఆనందలీలా
అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా

నల్లరాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆ నందలాల
జాణజానపదాలతో ఙానగీతి పలుకునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా

ఆలమందకాపరిలా కనిపించలేదా ఆ నందలాల
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆ నందలాల
తులసీదళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా

చినుకులా రాలి



చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను మరిచి పోబోకుమా మమత నీవే సుమా
చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ

ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నీ చూపులే
కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనె నే వేచి వుంటానులే
జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే వెల్లువౌతానులే
హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మధువులై పొంగి
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిధిలమైనా విడిచి పోబోకుమా విరహమైపోకుమా
||చినుకులా రాలి||

తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
పున్నమి నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే ఆ తీరాలు చేరాలిలే
మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి
ఈ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా ప్రేమ మయమే సుమా ప్రేమ మనమే సుమా
||చినుకులా రాలి||

బంతీ చేమంతి




బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే
మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే

చరణం1:

తేనె వాగుల్లో మల్లె పూలల్లే తేలి పోదాములే
గాలి వానల్లో మబ్బు జంటల్లే రేగి పోదాములే
విసిరే కొసచూపే ముసురై పోతుంటే
ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే
వేడెక్కి గుండెల్లో తలదాచుకో
తాపాలలో వున్న తడి ఆర్చుకో
ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే

బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే

చరణం2:

పూత పెదవుల్లో పుట్టు గొరింత బొట్టు పెట్టిందిలే
ఎర్ర ఎర్రంగ కుర్ర బుగ్గలో సిగ్గు తీరిందిలే
ఒదిగే మనాసేదో ఒకటై పొమ్మంటే
ఎదిగె వలపంతా ఎదలొకటై రమ్మంటే
కలాలు కరిగించు కౌగిల్లలో
దీపాలు వెలిగించు నీ కల్లతో
ఆ మాట వింటే కరిగే నా ప్రణమంతా నీ సొంతమేలే

బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే
మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే

ఆడవారి కోపం



ఆడవాళ్ళ కోపంలో అందమున్నది ఆహ

అందులోనె అంతులేని అర్థమున్నదీ

అర్థమున్నది

మొదటిరోజు కోపం అదో రకం శాపం

పోను పోను కలుగుతుంది బలే విరహ తాపం



బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు

తన మాటలందు చేతలందు పొత్తు కుదరదూ

పొత్తు కుదరదు



పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం

ఒక గడుసు పిల్ల కసరగానె లోన లుటారం

పడుచువాడీ...ఓహో (పడుచు)



వగలాడి తీపి తిట్టు తొలి వలపు తేనె పట్టు

ఆ తేనె కోరి చెంతజేర చెడామడా కుట్టు

(బ్రహ్మ)



పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలూ ఓహో

కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు

పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలూ

తమ కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు

వేడుకొన్న రోసం అది పైకి పగటివేశం

వెంటపడిన వీపు విమానం (ఆడవాళ్ళ)



చిలిపి కన్నె హృదయమెంతొ చిత్రమైనదీ

అది చిక్కు పెట్టు క్రాసువరుడు పజిలు వంటిది

చిలిపి కన్నే ............(చిలిపి)

ఆ పజిలు పూర్తి చేయి

తగు ఫలితముండునోయి

మరుపురాని మధురమైన ప్రైజు దొరుకునోయి

(ఆడవాళ్ళ)

రగులుతోంది మొగలిపొద (ఖైది)



రగులుతుంది మొగలిపొద
గుబులుకుంది కన్నె ఎద
నాగినిలా వస్తున్నా
కౌగిలినే ఇస్తున్నా
కాటేస్తావో వాటేస్తావో

రగులుతుంది మొగలిపొద
వగలమారి కన్నె ఎద
నాదస్వరమూదేస్తా
నాలో నిన్ను కలిపేస్తా
కాటేస్తాలే వాటేస్తాలే

మసక మసక చీకటిలో
మల్లెపూవు దీపమెట్టి
ఇరుకు ఇరుకు పొదరింట్లో
చెరుకుగడల మంచమేసి
విరహంతో దాహంతో
మోహంతో ఉన్నా నాట్యం చేస్తున్నా

నా పడగనీడలో
నీ పడక వేసుకో
నా పెదవి కాటులో మధువెంతో చూసుకో
కరిగిస్తాలే కవ్విస్తాలే
తాపంతో ఉన్నా
తరుముకువస్తున్నా

పున్నమంటి వెన్నెల్లో
పులకరింత నీకై మోసి
మిసిమి మిసిమి వన్నెల్లో
మీగడంత నేనే దోచి
పరువంతో ప్రణయంలో
తాళం వేస్తున్నా తన్మయమవుతున్నా

ఈ పొదల నీడలో నా పదును చూసుకో
నా బుసల వేడితో నీ కసినే తీర్చుకో
ప్రేమిస్తా పెనవేస్తా
పరవశమవుతున్నా
ప్రాణం ఇస్తున్నా



గోరింకా కూసింది



గోరింట పూసింది గోరింక కూసింది
గొడవేమిటే రామ చిలకా గొడవేమిటే రామ చిలకా
నే తీర్చనా తీపి అలకా ఆ నే తీర్చనా తీపి అలకా

గోరింక వలచింది గోరింక పండింది
కోరిందిలే రామ చిలక ..2
నీనుద్దు నా ముక్కు పుడక

ఏలో ఏలో ఏలేలేలో ఏలో ఏలో ఏలో

పొగడాకు తేనెలతో పొదరిల్లు కడిగేసి
రతనాల రంగులతో రంగవల్లుల్లు తీర్చి
ఎదలోనా పీటేసి ఎదురొచ్చికూర్చుంటే
సొదలేమిటే రామ చిలుకా
సొగసిచ్చుకో సిగ్గుపడక


విరజాజి రేకులతో
విరిసయ్య సవరించి
పండువెన్నెల తెచ్చి
పన్నీరు చిలికించి
నిదరంతా మింగేసే నిశిరాత్రి తోడుంటే
కొదవేమిటే గోరువంక
కడకొంగుతో కట్టుపడక

ఒక వనితా



హాఆ…. అజంతా వెలవెలబోదా, ఎల్లోరా తల్లడిల్లదా
కాశ్మీరం కలవరబడదా తాజమహల్ తడబడిపోదా
ఆ….. హాయ్ హాయ్ హాయ్
ఒక వనిత నవ ముదిత సుమలలిత రసభరిత
ఒక వనిత నవ ముదిత సుమలలిత రసభరిత
అలిగితే ఏమవుతుంది అందం నాగుపామవుతుంది
గోరింకా హహహ ఓ ఓ గోరింకా హై
గోరింకా ఒ ఒ ఒ గోరింకా హ హ హ హా

ఆ కొసవేళ్ళ సవరణ నోచుకున్న కురులదేమి భాగ్యమూ
ఆ అడుగుల నునుపు ముద్దాడుకున్న గడపదెంత సౌభాగ్యము
ఆ ఆ… అది కంటి మెరుపో ఆ బ్రహ్మ గెలుపో
అది కంటి మెరుపో ఆ బ్రహ్మ గెలుపో
టటా టటా టటా
లలలా లలలా లలలా లలలా
అలిగితే ఏమవుతుంది ఉదయమే నడి జామవుతుంది
గోరింకా ఓ ఓ గోరింకా
గోరింకా ఒ ఒ ఒ గోరింకా హ హ హ హా

ఆ అలివేణి మోమును చూపిన అద్దానిదెంతటి పుణ్యమో
ఆ చెలి నుదుటను ముద్దుగ దిద్దిన తిలకానిదెంతటి లావణ్యమో
ఆ ఆ… ఆ రంభ రూపం అపరంజి శిల్పం
ఆ రంభ రూపం అపరంజి శిల్పం
ఆ చంద్ర వదన ఆ కుందరదన
ఆ కమల నయన ఆ కాంతిసదన
నవ్వితే ఏమవుతుంది నవ్వే నవ్వుకు నవ్వవుతుంది
గోరింకా హై గోరింకా హ హ హ
గోరింకా చాలింకా

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య




మాటంటే బాణం ,ఏ మగువైనా ప్రాణం
ఆ ఇద్దరు దేవుళ్ళు కలిసి ఎత్తిన అవతారం
మనం ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య

భార్య అడిగితే ఏది లేదనను
బంగారు లేడి తెమ్మన్నా కాదనను
ఇల్లుదాటితే నేను నేనుకాను
అందుకే మనం "ఇంట్లో"

ధర్మపత్ని ఎడబాటు తట్టుకోను
పది తలలు ఎదురైనా ఎగురగొట్టుతాను
మనసైతే మురళిని చేపట్టుతాను
వేలమంది గోపికలకు గజ్జె కట్టుతాను "ఇంట్లో"

ఒక్క భార్య ఉన్నవాడు దేవుడే
మరి అష్టభార్యలున్నవాడు దేవుడే
ఆ ఇద్దరు దీవించిన చిరంజీవిని
విల్లంబులు పట్టిన సవ్యచాచిని
అపర సవ్య చాచిని అందుకేమనం "ఇంట్లో"

6, మార్చి 2011, ఆదివారం

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి



దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి (2)
ఇక ఊరేల సొంత ఇల్లేలా
ఇక ఊరేల సొంత ఇల్లేలా ఓ చెల్లెలా
ఎలా ఈ స్వార్ధం ఏది పరమార్ధం (2)

చరణం:
నన్నడిగి తల్లీదండ్రీ కన్నారా... ఆ ఆ ఆ ఆ అ
నన్నడిగి తల్లీదండ్రీ కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మ
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది ఈ బేధాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏలా ఈ స్వార్ధం ఏది పరమార్ధం

చరణం:
శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముల్లకట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మ
కళ్ళులేని కబోది చేతి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా
ఏలా ఈ స్వార్ధం ఏది పరమార్ధం

చరణం:
తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియపోతేనే వేదాంతము
మన్నులోనే మాణిక్యాన్ని వెతికే వెర్రమ్మ
నిన్ను నీవే తెలుసుకుంటే చాలును పోవమ్మ
ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏలా ఈ స్వార్ధం ఏది పరమార్ధం

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

కొంటె చూపుతో



కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనస్సు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలానే
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనస్సు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలానే

మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కళ్లు రాసే నీ కళ్లు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది

చరణం:
పగలే రేయయినా యుగమే క్షణమైనా కాలం నీతోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈవేళ ఇరువురి దూరాలు తరగనీ
ఒడిలో వాలాలనున్నదీ వద్దని సిగ్గాపుతున్నది
తడబడు గుండెలలో మోమాటం ఇది

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనస్సు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలానే

చరణం:
కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటూ తెలుపగా
చూపులు నిన్నే పిలిచేనే నా ఊపిరి నీకై నిలిచినే
చావుకు భయపడనే నువ్వుంటే చెంత

కళ్లు రాసే నీ కళ్లు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది
మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనస్సు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలానే

సీతాకోక చిలుక (మిన్నేటి సూరీడు)



మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దు పొడిచి
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ

చరణం:
చుక్క నవ్వవే వేగుల చుక్క నవ్వవే
కంటి కోలాటాల జంట పేరంటాల
ఓ... చుక్క నవ్వవే నావకు చుక్కానవ్వవే
పొందు ఆరాటాల పొంగు పోరాటాల
మొగ్గ తుంచుకుంటే మొగమాటాల
బుగ్గ దాచుకుంటే బులపాటాల
దప్పికంటే తీర్చతానికిన్ని తంటాల

మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ

చరణం:
ఓ రామ చిలుక చిక్కని ప్రేమ మొలక
గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
ఈడుకున్న గోడు నువ్వే గోరింక
తోడుగుండిపోవే కంటినీరింక
పువ్వునుంచి నవ్వును తుంచలేరులే ఇంక

మిన్నేటి సూరీడు మిన్నేటి సూరీడు....
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దు పొడిచి
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ

చిన్ని చిన్ని (మౌన రాగం)

ఈనాడే ఏదో అయ్యింది (ప్రేమ)



ఈనాడే ఏదో అయ్యింది..
ఏనాడు నాలో జరగనిది...

ఈ అనుభవం మరల రానిది..
ఆనంద రాగం మోగింది...
అందాల లోకం రమ్మంది...

ఈనాడే ఏదో అయ్యింది...
ఏనాడు నాలో జరగనిది..

నింగి నేల ఏకం కాగా...
ఈ క్షణం ఇలా ఆగింది..
ఒకటే మాట అన్నది..
ఒకటై పొమ్మన్నది..
మనసే ఇమ్మన్నది..
అదినా సోమ్మన్నది...
పరువాలు నేటి..
సెలయేటి తోటి..
పాడాలి నేడు...
కావాలి తోడూ...ల ల ల ...

ఈనాడే ఏదో అయ్యింది..
ఏనాడు నాలో జరగనిది..
సూర్యుని మాపి..
చంద్రుని ఆపి..
వెన్నెల రోజంతా కాచింది..
పగలు రేయన్నది..
అసలే లేదన్నది. .
కలలే వద్దన్నది..
నిజమే కమ్మన్నది..
ఎదలోని ఆశ..
ఎరగాలి ఈ భాష..
కలవాలి నీవు...
కరగాలి నేను..

ఈనాడే ఏదో అయ్యింది..
ఏనాడు నాలో జరగనిది...

ఈ అనుభవం మరల రానిది
ఆనంద రాగం మోగింది
అందాల లోకం రమ్మంది
ఈనాడే ఏదో అయ్యింది
ఏనాడు నాలో జరగనిది

మాటే మంత్రము



మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం కమణీయం జీవితం
ఓ.. మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం కమణీయం జీవితం

ఓ.. మాటే మంత్రము మనసే బంధము

నీవే నాలో స్పందించిన ఈ ప్రియ లల్యలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా పువ్వు తావిగా సమ్యొగాల సంగీతాలు విరిసె వేళలో
మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం కమణీయం జీవితం
మాటే మంత్రము మనసే బంధము

నేనే నీవై ప్రేమించినా ఈ అనురాగం పలికించే పల్లవివే
యదలా కోవెల ఎదుటే దెవత వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో
మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం కమణీయం జీవితం

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి



కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
విశ్వనాధ కవితై.. అది విరుల తేనెచినుకై..
కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై!!

పచ్చని చేలా.. తనననన..
పావడగట్టి.. తనననన..
పచ్చని చేలా పావడగట్టి..
కొండమల్లెలే కొప్పునబెట్టి
వచ్చే దొరసానీ.. మా వన్నెల కిన్నెరసాని!!

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..

ఎండల కన్నే సోకని రాణి..
పల్లెకు రాణి పల్లవపాణి..
కోటను విడిచీ.. పేటను విడిచీ..
కోటను విడిచీ.. పేటను విడిచీ..

కన్నులా గంగా పొంగే వేళ..
నదిలా తానే సాగే వేళ..
రాగాల రాదారి పూదారి ఔతుంటే!!
ఆ రాగాల రాదారి పూదారి ఔతుంటే!!

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి!!

మాగాణమ్మా చీరలు నేసె..
మలిసందెమ్మ కుంకుమ పూసే..
మువ్వలబొమ్మా ముద్దులగుమ్మా..
మువ్వలబొమ్మా ముద్దులగుమ్మా..

గడపా దాటి నడిచే వేళ..
అదుపే విడిచీ ఎగిరే వేళ..
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే!!
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే!!

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
విశ్వనాధ కవితై.. అది విరుల తేనెచినుకై..
కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై!!

పచ్చని చేలా.. తనననన..
పావడగట్టి.. తనననన..
పచ్చని చేలా పావడగట్టి..
కొండమల్లెలే కొప్పునబెట్టి

వచ్చే దొరసానీ.. మా వన్నెల కిన్నెరసాని..
వచ్చే దొరసానీ.. మా వన్నెల కిన్నెరసాని!!

3, మార్చి 2011, గురువారం

సైనికుడు (సొగసుచూడ తరమా)



సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా

హా.. సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా

ఓ చల్లగాలీ ఆ నింగీ దాటి ఈ పిల్లగాలి వైపు రావా
ఊహల్లో తేలీ నీ వళ్ళో వాలీ నాప్రేమ ఊసులాడనీవా
పాలనురుగులపైన పరుగులు తీసి పాలు పంచుకోవా
పూల మధురిమ కన్న మధురము కాదా ప్రేమగాధ వినవా

సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా

డోలారే డోలా డోలారే డోలా మోగింది చూడూ గట్టిమేళా
బుగ్గే కందేలా సిగ్గే పడేలా నాకొచ్చెనమ్మా పెళ్ళి కళా
మబ్బు పరుపుల మాటు మెరుపుల మేన పంపెనమ్మ వానా
నన్ను వలచినవాడు వరుడై రాగా ఆదమరచిపోనా

సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమా హో
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా

సొగసు చూడ తరమా



పల్లవి :
సొగసు చూడతరమా!..
సొగసు చూడ తరమా - నీ సొగసు చూడ తరమా..
మరుని నారి, నారిగ మారి - మదిని నాటు విరిశరమా
సొగసు చూడ - సొగసు చూడతరమా!..




కులుకే సుప్రభాతాలై - కునుకే స్వప్న గీతాలై
ఉషా కిరణమూ - నిషా తరుణమూ
కలిసె కలికి మేనిగా - రతి కాంతుని కొలువుగా
వెలసే చెలి చిన్నెలలో - సొగసు చూడ తరమా !!


పలుకా చైత్ర రాగాలే - అలకా గ్రీష్మ తాపాలె
మదే, కరిగితే - అదే, మధుఝరీ
చురుకు వరద గౌతమీ - చెలిమి శరత్ పౌర్ణమీ
అతివే.. అన్ని ఋతువులయ్యే

సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడ తరమా
మరుని నారి, నారి గ మారి.. మదిని నాటు విరిశరమా
సొగసు చూడ - సొగసు చూడ తరమా!

సొగసు చూడతరమా (మిష్టర్ పెళ్ళాం)



సొగసుచూడ తరమా
నీ సొగసు చూడ తరమా

నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు
ఎఱ్ఱన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు
అందమే సుమా
సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా

అరుగుమీద నిలబడీ
నీ కురులను దువ్వేవేళా
చేజారిన దువ్వెన్నకు
బేజారుగ వంగినపుడు
చిరు కోపం చీరకట్టి
సిగ్గును చంగున దాచి
భగ్గుమన్న చక్కదనం
పరుగో పరుగెత్తి నపుడు- సొగసు -



పెట్టీ పెట్టని ముద్దులు ఇట్టే విదిలించి కొట్టి
ఉమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటు వేళ
చెంగు బట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే
తడి బారిన కన్నులతో విడు విడు మంటున్నప్పుడు - సొగసు -


జారుముడిని జడకేసి,
జానకిలా అడుగేసి,
తన అందెలు నా గుండెల ఘల్లు ఝల్లు మంటుంటె
నా సతిలా ఆరతిలా,
కల్యాణపు హారతిలా
శుక్రవారపు సంధ్య వేళ సుదతి గుదికి వెల్తుంటే - సొగసు -


పసి పాపకు పాలిస్తూ పరవశించి ఉన్నపుడు
పెద పాపడు పాకి వచ్చి "మరి నాకో?" అన్నపుడు
మొట్టి కాయ వేసి "చి! పొండి!" అన్నప్పుడు
నా యేడుపూ :) నీ నవ్వులూ ... హరివిల్లయి వెలసినపుడు - సొగసు -



సిరి మల్లెలు హరినీలపు జడలో తురిమి
క్షణమే యుగమై వేచీ వేచీ
చలి పొంగులు తెలి కోకల ముడిలో అదిమి
అలసి సొలసి కన్నులు వాచి
నిట్టూర్పులా నిశిరాత్రి లో నిదరూవు అందాలతో
త్యాగారాజ కృతిలో సీతాకృతిగల ఇటువంటి - సొగసు -