8, మార్చి 2011, మంగళవారం

ఆడవారి కోపం



ఆడవాళ్ళ కోపంలో అందమున్నది ఆహ

అందులోనె అంతులేని అర్థమున్నదీ

అర్థమున్నది

మొదటిరోజు కోపం అదో రకం శాపం

పోను పోను కలుగుతుంది బలే విరహ తాపం



బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు

తన మాటలందు చేతలందు పొత్తు కుదరదూ

పొత్తు కుదరదు



పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం

ఒక గడుసు పిల్ల కసరగానె లోన లుటారం

పడుచువాడీ...ఓహో (పడుచు)



వగలాడి తీపి తిట్టు తొలి వలపు తేనె పట్టు

ఆ తేనె కోరి చెంతజేర చెడామడా కుట్టు

(బ్రహ్మ)



పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలూ ఓహో

కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు

పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలూ

తమ కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు

వేడుకొన్న రోసం అది పైకి పగటివేశం

వెంటపడిన వీపు విమానం (ఆడవాళ్ళ)



చిలిపి కన్నె హృదయమెంతొ చిత్రమైనదీ

అది చిక్కు పెట్టు క్రాసువరుడు పజిలు వంటిది

చిలిపి కన్నే ............(చిలిపి)

ఆ పజిలు పూర్తి చేయి

తగు ఫలితముండునోయి

మరుపురాని మధురమైన ప్రైజు దొరుకునోయి

(ఆడవాళ్ళ)

కామెంట్‌లు లేవు: