6, మార్చి 2011, ఆదివారం

సీతాకోక చిలుక (మిన్నేటి సూరీడు)

మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ

అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దు పొడిచి

చరణం:
చుక్క నవ్వవే వేగుల చుక్క నవ్వవే
కంటి కోలాటాల జంట పేరంటాల
ఓ... చుక్క నవ్వవే నావకు చుక్కానవ్వవే
పొందు ఆరాటాల పొంగు పోరాటాల
మొగ్గ తుంచుకుంటే మొగమాటాల
బుగ్గ దాచుకుంటే బులపాటాల
దప్పికంటే తీర్చతానికిన్ని తంటాల

మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ

చరణం:
ఓ రామ చిలుక చిక్కని ప్రేమ మొలక
గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
ఈడుకున్న గోడు నువ్వే గోరింక
తోడుగుండిపోవే కంటినీరింక
పువ్వునుంచి నవ్వును తుంచలేరులే ఇంక

మిన్నేటి సూరీడు మిన్నేటి సూరీడు....
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దు పొడిచి
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ

కామెంట్‌లు లేవు: