8, మార్చి 2011, మంగళవారం

రగులుతోంది మొగలిపొద (ఖైది)



రగులుతుంది మొగలిపొద
గుబులుకుంది కన్నె ఎద
నాగినిలా వస్తున్నా
కౌగిలినే ఇస్తున్నా
కాటేస్తావో వాటేస్తావో

రగులుతుంది మొగలిపొద
వగలమారి కన్నె ఎద
నాదస్వరమూదేస్తా
నాలో నిన్ను కలిపేస్తా
కాటేస్తాలే వాటేస్తాలే

మసక మసక చీకటిలో
మల్లెపూవు దీపమెట్టి
ఇరుకు ఇరుకు పొదరింట్లో
చెరుకుగడల మంచమేసి
విరహంతో దాహంతో
మోహంతో ఉన్నా నాట్యం చేస్తున్నా

నా పడగనీడలో
నీ పడక వేసుకో
నా పెదవి కాటులో మధువెంతో చూసుకో
కరిగిస్తాలే కవ్విస్తాలే
తాపంతో ఉన్నా
తరుముకువస్తున్నా

పున్నమంటి వెన్నెల్లో
పులకరింత నీకై మోసి
మిసిమి మిసిమి వన్నెల్లో
మీగడంత నేనే దోచి
పరువంతో ప్రణయంలో
తాళం వేస్తున్నా తన్మయమవుతున్నా

ఈ పొదల నీడలో నా పదును చూసుకో
నా బుసల వేడితో నీ కసినే తీర్చుకో
ప్రేమిస్తా పెనవేస్తా
పరవశమవుతున్నా
ప్రాణం ఇస్తున్నా



కామెంట్‌లు లేవు: