17, ఆగస్టు 2011, బుధవారం

ఇద్దరు మిత్రులు (హలోహలో అమ్మాయి)హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచొ వేడుకొనడు అబ్బాయి
ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
ఆదినుంచి లోకంలో ఆడవారిది పై చేయి

నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరపాటు
నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరపాటు
నాటికీ నేటికీ మీకు అలవాటే
హలో హలో ఓ అమ్మాయి అవును మీదే పై చేయి

బెట్టు చేసే మగవారి గుట్టు మాకు తెలుసోయి
బెట్టు చేసే మగవారి గుట్టు మాకు తెలుసోయి
మనసులూ మమతలూ పైకి వేషాలూ
ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి

లడాయి చేసే స్త్రీ జాతి రాకమానదు రాజీకి
లడాయి చేసే స్త్రీ జాతి రాకమానదు రాజీకి
గెలుపు కోసం మగవారు
గెలుపు కోసం మగవారు
కాళ్ళ బేరము లాడకపోరు
ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
ఆదినుంచి లోకంలో ఆడవారిది పై చేయి

హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచొ వేడుకొనడు అబ్బాయి
హలో హలో ఓ అమ్మాయి అందుకొనుమా నా గుడ్‌బై

కామెంట్‌లు లేవు: