17, ఆగస్టు 2011, బుధవారం

పట్నం వచ్చిన పతివ్రతలు(సీతారామ స్వామి)సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
కోరితినా ఆ ఒక్కటితప్పా
నేరాలెన్నగ నేనే గొప్పా స్వామీ

నీ కౌగిలే కాసుల పేరని
నీ ముద్దులే ముత్యపుసరులని
మురిసితిగాని కొసరి కొసరి నే కోరితినా ఆ ఒక్కటి తప్ప
అది నీకు నాకు తెలుసును తప్ప స్వామి

ఇంటిపెత్తనాలడిగితినా
వీధికెక్కినే నలిగితినా
ఆ..ఆ.ఆ..ఆ
సాధింపులతో సణిగితినా
నిను బాధపెట్టి నేనెరుగుదునా
కోరితినా ఆ ఒక్కటితప్పా
నేరాలెన్నగా నేనే గొప్ప స్వామి

ఎన్నాళ్ళీ లంక చెర ..
ఏనాడు విందువో నాదుమొర
ఆతప్రాణపరయాణ శీలా
అన్యమడుగునా ఆ ఒక్కటితప్ప
కోరితినా ఆ కోరికతప్ప అది నీకు నాకు తలుసును తప్ప స్వామి

కామెంట్‌లు లేవు: