ఆ రోజుల్లో నరేష్ లవర్ బాయ్ అంట నాలుగు స్తంబాలాట లో పాట ఇది ... చాలా బాగుంటుంది సంగీతం ...సాహిత్యం.. అన్నట్లు పూర్ణిమా ఎన్ని సినిమాల్లో చూసినా అలాగే ఉంటుంది మొహం మారదుఆ అమ్మాయిది .. మా చెల్లి లాగే :)
చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను మరిచి పోబోకుమా మమత నీవే సుమా
చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నీ చూపులే
కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనె నే వేచి వుంటానులే
జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే వెల్లువౌతానులే
హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మధువులై పొంగి
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిధిలమైనా విడిచి పోబోకుమా విరహమైపోకుమా
తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
పున్నమి నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే ఆ తీరాలు చేరాలిలే
మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి
ఈ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా ప్రేమ మయమే సుమా ప్రేమ మనమే సుమా
4 కామెంట్లు:
నే ఈ పాట మొదటి సారి వర్షం పడుతుంటే, రేడియో లో విన్నా, చాలా నచ్చేసింది :)
nenu avunu nice song:)
ఈ పాట నాకు చాలా ఇష్టం అండి....ఈ బ్లాగ్ నచ్చింది నాకు .......ఆ బ్లాగ్ లో కామెంట్ పెడితే నడి సముద్రం లో చిక్కుకు పోయిన నావ లాగా ఆ నావ కి నావికుడు లా అనిపిస్తుంది నాకు ...పోటీ తట్టుకోలెం అండి...అయినా మీ జాజిపూలు పోస్టులు వదలకుండా చదివేస్తున్నా
హ హ భలేవారే ఇక్కడ అయితే తక్కువమంది ఉంటారనా :) ..నాకూ ఈ పాట చాలా ఇష్టం
కామెంట్‌ను పోస్ట్ చేయండి