9, ఏప్రిల్ 2010, శుక్రవారం

జిలిబిలి పలుకులు(సితార)

అబ్బా ఈ పాటలో భానుప్రియ ఎంత బాగుంటుందో.. చిన్నాన్నకు ఎంత ఇష్టం ఈ అమ్మాయంటే.. ఒక్క మాట అననిచ్చేవాడు కాదు ... బోలెడు ఫొటోస్ దాచుకునేవాడు ..నేను మాత్రం భాను ప్రియ వెంకటేష్ పెళ్లి చేసుకుంటే బాగుండును అనేసుకునేదాన్ని ..స్వర్ణ కమలం సినిమా చూసిన దగ్గరనుండి :)



జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
కిల కిల నగవుల వలపులు చిలికిన
ఓ మైనా మైనా
మిలిమిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
మిలిమిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన
ఓ మైనా ఓ మైనా
కలలను పెంచకు కలతలు దాచకు
ఏమైనా ఓ మైనా

అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిళ్ళు నీకైనా నాకైనా
తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ
తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ
హరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా

ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా
మెరుపులలొ నిలకడగా కనిపించే ఈ మైనా
యెండలకే అల్లాడే వెన్నలలో త్రినీడ
యెండలకే అల్లాడే వెన్నలలో త్రినీడ
వినువీధి వీణల్లొ రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఏమైనా
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మినుగురు సొగసులాడెమైన మైన
మిలి మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
గుడికే చేరని దీపం పడమటి సంధ్యా రాగం
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
చుక్కలు అందక దిక్కున దాగిన నేనేలే ఆ మైనా

s janaki

కామెంట్‌లు లేవు: