9, ఏప్రిల్ 2010, శుక్రవారం

చిన్న మాట( మల్లెపూవు)

ఈ పాట అమ్మ రేడియో పెట్టి పనులు చేసుకుంటుంటే నేను వింటూ ఉండేదాన్ని చిన్నప్పుడు ... ఒక సారి కలలో కుడా ఈ సాంగ్ వచ్చేస్తూ ఉండేది ... చక్కని సంగీతం ..



చిన్నమాట... ఒక చిన్నమాట
చిన్నమాట... ఒక చిన్నమాట (2)
సందెగాలి వీచి సన్నజాజి పూచి
జలదరించే చల్లనివేళ చిన్నమాట


రాక రాక నీవు రాగ వలపు ఏరువాక
నావెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా
నువ్వు వస్తే నవ్వులిస్తా
పువ్వులిస్తే పూజ చేస్తా
వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు
మాట మాట


కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయె
నీ వాలుచూపే నీలాల మెరుపై విరితేనెలే వెల్లువాయె
అందమంతా ఆరబొసి
మల్లెపూల పానుపేసి
వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు
మాట మాట




2 కామెంట్‌లు:

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

veturi gaariki emraayalo tochaka.....chakravartito chinnamata chinnamata ante ive padaalu use chesi raayamannaru anta.......

excellent song......chakravarti gaari songslo edo teliyani melody and voopu vuntundi.

నేస్తం చెప్పారు...

వినయ్ అవును నేనూ విన్నాను..విన్నపుడు ఈ పాట ఎంత ఆహ్లాదంగా ఉంటుందో