18, ఏప్రిల్ 2010, ఆదివారం

కురిసేను విరుజల్లులే(ఘర్షణ)

ఈ పాట మణిరత్నం సినిమా ఘర్షణ లోనిది .. రొమాంటిక్ పాటలు ఆయన సినిమా లోనే చూడాలనిపించేలా తీస్తారు అతను...ఆ లైటింగ్ , ఆహ్లాదం ,చల్ల గాలి.. కెమెరామెన్ టాలెంట్ ఏమిటో తెలుస్తుంది ..


కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకివే శ్రీకారమే కావె
కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే
ఆకుల పై రాలు ఆ..
ఆకుల పై రాలు హిమబిందువువోలే
నా చెలి ఒడిలోన పవళించనా (2)
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాని యద చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళం
నీవు నాకు వేద నాదం
కురిసేను విరిజల్లులే (||)
కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు
వన్నెల మురిపాల కథ ఏమిటో
తలపుల మాటల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కళలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరి వాన
మధురిమలు అందించు సుధలేమిటో
పరవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహబంధం
ఆలపించే రాగబంధం
కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకివే శ్రీకారమే కావె
కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే

2 కామెంట్‌లు:

Manasa Chamarthi చెప్పారు...

ee paatante naakkodaa praname nandi..:)
bhale baaguntundi..

నేస్తం చెప్పారు...

manasa :)