14, మే 2010, శుక్రవారం

కంచికి పోతావా కృష్ణమ్మా(శుభోదయం)

ఈ పాట చూస్తే అమ్మ గుర్తువస్తుంది ..అమ్మ దగ్గర ఇంకాఆ హీరోయిన్ కట్టినటువంటి చీరలు ఉన్నాయి :)




కంచికి పోతావా క్రిష్ణమ్మా ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మా
కంచికి పోతావా క్రిష్ణమ్మా ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
కంచికి పోతావా క్రిష్ణమ్మా ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
కంచికి పోతావా క్రిష్ణమ్మా

త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ
రగమేమో తీసినట్టు ఉందమ్మ
త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ
రగమేమో తీసినట్టు ఉందమ్మ
ముసి ముసి నవ్వుల పువ్వులు పూసింది కొమ్మ
మువ్వ గొపాల మువ్వ గొపలా
మువ్వ గొపాలా అన్నట్టుందమ్మ
అడుగుల్లొ సవ్వళ్ళు కావమ్మా
అవి ఎడదలో సందళ్ళు లేవమ్మా
అడుగుల్లొ సవ్వళ్ళు కావమ్మా
అవి ఎడదలో సందళ్ళు లేవమ్మా

రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ
రాతిరేల సంత నిదుర రాదమ్మ
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ
రాతిరేల సంత నిదుర రాదమ్మ
ముసిరిన చీకటి ముంగిట వేచింది కొమ్మ
ముద్దుమురిపాల మువ్వగోపాలా
నీవు రావేలా అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా

నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
కంచికి పోతావా క్రిష్ణమ్మా
ముద్దుమురిపాల
ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మామువ్వగోపాలా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా


3 కామెంట్‌లు:

3g చెప్పారు...

ఈ పాట నాక్కూడా ఇష్టమండి...... ఎక్కువగా ఆడియో వింటూంటాను వీడియో ఇదేచూడడం. ఈ సినిమా లోనే ఇంకో పాట ఉంటుంది "మందార మకరంద మాధుర్యమున......" అని, సూపర్ పాట పాడింది ఏవరో తెలీదు కాని చాలాబాగా పాడారు ఆవిడ, ట్యూన్ కూడా సూపరుంటుంది.

ప్రణీత స్వాతి చెప్పారు...

అయ్యయ్యో...నేస్తంగారూ..నే రాసేద్దాం అనుకున్న పాట. మీరాల్రెడీ రాసేశారు టపా.

నేస్తం చెప్పారు...

3G గారు అవును ఈ సినిమాలో పాటలన్నీ సూపరే ..కాకపోతే ఎక్కువ ఇష్టం ఈ పాట.. ప్రణిత ఈ పాట గురించి ఎన్ని పోస్ట్ల్లోవేసినా తక్కువే అంత చక్కని సాహిత్యం..సంగీతం