14, మే 2010, శుక్రవారం

ఉరకలై గోదావరి(అభిలాష)

అబ్బో చిరు పాటలు మా ఇంట్లో మారు మొగిపోయేవి.. మహేష్ నాన్న అభిమాన హీరో కదా .. చిరంజీవి అంటే ప్రాణం పెట్టేసేవాడు.. ఆ రోజులు గుర్తువచ్చేస్తున్నాయి .హుమ్


ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళీ
రసమయం జగతి

నీ ప్రణయభవం నా జీవ రాగం
నీ ప్రణయభవం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి
అనురాగ రాగాల పరలోకమె మనదైనది

ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళీ
రసమయం జగతి

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది

ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళీ
రసమయం జగతి

1 కామెంట్‌:

రాజ్ కుమార్ చెప్పారు...

idi naa favorite song nestam....
thanks for sharing...