15, నవంబర్ 2011, మంగళవారం
ఓ రంగయో పూలరంగయో
ఓ రంగయో పూలరంగయో
ఓరచూపు చాలించి సాగిపోవయో
పొద్దు వాలిపోతున్నదోయి
ఇంత మొద్దు నడక నీ కేందుకోయి
చరణం 1
పగలనక రేయనక పడుతున్న శ్రమనంతా
పరులకొరకు ధారపోయు మూగజీవులు
ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి
ఆనందం పొందగలుగు ధన్యజీవులు
చరణం 2
కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని
ఈ దీనుల జీవితాలు మారుటెన్నడో
కలవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి
కనిపెట్టి మేలు చేయ గలిగినప్పుడే
ఓ రంగయో పూల రంగయో
ఓర చూపు చాలించి సాగిపొవయో
పొద్దువాలిపోతున్నదోయి
ఇంత మొద్దునడక నీకెందుకోయి ||ఓ రంగయో||
మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా..
మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా..
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..
మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా..
నీది కానిదేది లేదు నాలో..
నిజానికి నేనున్నది నీలో..
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో..
ఆ ఒక్కటీ చిక్కె నీ గుప్పిటిలో..
మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా..
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..
మెల్ల మెల్ల మెల్లగా..
నిన్ను చూచి నన్ను నేను మరచినాను..
నన్ను దోచుకొమ్మని నిలిచినాను..
దోచుకుందమనే నేను చూచినాను..
చూచి చూచి నీవె నన్ను దోచినావు!
మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా..
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..
మెల్ల మెల్ల మెల్లగా..
కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు..
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు..
దొరికినాము చివరకు తోడుదొంగలం..
దొరలమై ఏలుదాం వలపు సీమలూ..
మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా..
మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా..
చిత్రం: దాగుడు మూతలు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
సంగీతం: KV మహదేవన్
గానం: ఘంటసాల, సుశీల
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)