6, మార్చి 2011, ఆదివారం

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి



దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి (2)
ఇక ఊరేల సొంత ఇల్లేలా
ఇక ఊరేల సొంత ఇల్లేలా ఓ చెల్లెలా
ఎలా ఈ స్వార్ధం ఏది పరమార్ధం (2)

చరణం:
నన్నడిగి తల్లీదండ్రీ కన్నారా... ఆ ఆ ఆ ఆ అ
నన్నడిగి తల్లీదండ్రీ కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మ
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది ఈ బేధాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏలా ఈ స్వార్ధం ఏది పరమార్ధం

చరణం:
శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముల్లకట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మ
కళ్ళులేని కబోది చేతి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా
ఏలా ఈ స్వార్ధం ఏది పరమార్ధం

చరణం:
తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియపోతేనే వేదాంతము
మన్నులోనే మాణిక్యాన్ని వెతికే వెర్రమ్మ
నిన్ను నీవే తెలుసుకుంటే చాలును పోవమ్మ
ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏలా ఈ స్వార్ధం ఏది పరమార్ధం

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

కామెంట్‌లు లేవు: