3, మార్చి 2011, గురువారం

సొగసు చూడ తరమా



పల్లవి :
సొగసు చూడతరమా!..
సొగసు చూడ తరమా - నీ సొగసు చూడ తరమా..
మరుని నారి, నారిగ మారి - మదిని నాటు విరిశరమా
సొగసు చూడ - సొగసు చూడతరమా!..




కులుకే సుప్రభాతాలై - కునుకే స్వప్న గీతాలై
ఉషా కిరణమూ - నిషా తరుణమూ
కలిసె కలికి మేనిగా - రతి కాంతుని కొలువుగా
వెలసే చెలి చిన్నెలలో - సొగసు చూడ తరమా !!


పలుకా చైత్ర రాగాలే - అలకా గ్రీష్మ తాపాలె
మదే, కరిగితే - అదే, మధుఝరీ
చురుకు వరద గౌతమీ - చెలిమి శరత్ పౌర్ణమీ
అతివే.. అన్ని ఋతువులయ్యే

సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడ తరమా
మరుని నారి, నారి గ మారి.. మదిని నాటు విరిశరమా
సొగసు చూడ - సొగసు చూడ తరమా!

కామెంట్‌లు లేవు: