6, మార్చి 2011, ఆదివారం

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
విశ్వనాధ కవితై.. అది విరుల తేనెచినుకై..
కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై!!

పచ్చని చేలా.. తనననన..
పావడగట్టి.. తనననన..
పచ్చని చేలా పావడగట్టి..
కొండమల్లెలే కొప్పునబెట్టి
వచ్చే దొరసానీ.. మా వన్నెల కిన్నెరసాని!!

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..

ఎండల కన్నే సోకని రాణి..
పల్లెకు రాణి పల్లవపాణి..
కోటను విడిచీ.. పేటను విడిచీ..
కోటను విడిచీ.. పేటను విడిచీ..

కన్నులా గంగా పొంగే వేళ..
నదిలా తానే సాగే వేళ..
రాగాల రాదారి పూదారి ఔతుంటే!!
ఆ రాగాల రాదారి పూదారి ఔతుంటే!!

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి!!

మాగాణమ్మా చీరలు నేసె..
మలిసందెమ్మ కుంకుమ పూసే..
మువ్వలబొమ్మా ముద్దులగుమ్మా..
మువ్వలబొమ్మా ముద్దులగుమ్మా..

గడపా దాటి నడిచే వేళ..
అదుపే విడిచీ ఎగిరే వేళ..
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే!!
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే!!

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
విశ్వనాధ కవితై.. అది విరుల తేనెచినుకై..
కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై!!

పచ్చని చేలా.. తనననన..
పావడగట్టి.. తనననన..
పచ్చని చేలా పావడగట్టి..
కొండమల్లెలే కొప్పునబెట్టి

వచ్చే దొరసానీ.. మా వన్నెల కిన్నెరసాని..
వచ్చే దొరసానీ.. మా వన్నెల కిన్నెరసాని!!

కామెంట్‌లు లేవు: