8, మార్చి 2011, మంగళవారం

ఒక వనితా



హాఆ…. అజంతా వెలవెలబోదా, ఎల్లోరా తల్లడిల్లదా
కాశ్మీరం కలవరబడదా తాజమహల్ తడబడిపోదా
ఆ….. హాయ్ హాయ్ హాయ్
ఒక వనిత నవ ముదిత సుమలలిత రసభరిత
ఒక వనిత నవ ముదిత సుమలలిత రసభరిత
అలిగితే ఏమవుతుంది అందం నాగుపామవుతుంది
గోరింకా హహహ ఓ ఓ గోరింకా హై
గోరింకా ఒ ఒ ఒ గోరింకా హ హ హ హా

ఆ కొసవేళ్ళ సవరణ నోచుకున్న కురులదేమి భాగ్యమూ
ఆ అడుగుల నునుపు ముద్దాడుకున్న గడపదెంత సౌభాగ్యము
ఆ ఆ… అది కంటి మెరుపో ఆ బ్రహ్మ గెలుపో
అది కంటి మెరుపో ఆ బ్రహ్మ గెలుపో
టటా టటా టటా
లలలా లలలా లలలా లలలా
అలిగితే ఏమవుతుంది ఉదయమే నడి జామవుతుంది
గోరింకా ఓ ఓ గోరింకా
గోరింకా ఒ ఒ ఒ గోరింకా హ హ హ హా

ఆ అలివేణి మోమును చూపిన అద్దానిదెంతటి పుణ్యమో
ఆ చెలి నుదుటను ముద్దుగ దిద్దిన తిలకానిదెంతటి లావణ్యమో
ఆ ఆ… ఆ రంభ రూపం అపరంజి శిల్పం
ఆ రంభ రూపం అపరంజి శిల్పం
ఆ చంద్ర వదన ఆ కుందరదన
ఆ కమల నయన ఆ కాంతిసదన
నవ్వితే ఏమవుతుంది నవ్వే నవ్వుకు నవ్వవుతుంది
గోరింకా హై గోరింకా హ హ హ
గోరింకా చాలింకా

1 కామెంట్‌:

telugucinema kaburlu చెప్పారు...

మీ సాంగ్స్ కలెక్షన్స్ , మీ టేస్ట్ చాలా బాగుంది.. కానీ మరీ పాత వాసన కోడుతుంది...అంటే కొత్త సినిమాలలో మంచి పాటలు లేవనేది మీ అభిప్రాయమా......