9, ఏప్రిల్ 2010, శుక్రవారం

నా పేరు బికారి( శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ )

ఎంత చక్కని సాహిత్యం..చక్కని సంగీతం ... హాయిగా ఉంటుంది మనసుకు ...చూసినా విన్నా ఆనందమే ఈ పాట ...



నా పేరు బికారి ...నా దారి ఎడారి....
మనసైన చోట మజిలి.. కాదన్నచాలు బదిలీ...
నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి

చరణం1:
తోటకు తోబుట్టువును... ఏటికి నే బిడ్డను
పాట నాకు సైదోడు.. పక్షి నాకు తోడు
విసుగు రాదు.. ఖుషి పోదు.. వేసట లేనే లేదు
విసుగు రాదు.. ఖుషి పోదు.. వేసట లేనే లేదు
అసలు నా మరో పేరు ఆనంద విహారి

నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి

చరణం2:
మేలుకొని ..కలలుగని..మేఘాల మేడపై
మెరుపు తీగలాంటి నా ప్రేయసినూహించుకొని
ఇంద్రధనస్సు పల్లకి ఎక్కి కలుసుకోవాలనీ
ఆఅ ఆఆ ఆ ఆఆ ఆఅ ఆఆ.....ఆ
ఇంద్రధనస్సు పల్లకి ఎక్కి కలుసుకోవాలనీ
ఆకాశవీధిలో పయనించు బాటసారి....
నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి

చరణం3:
కూటికి నే పేదను... గుణములలో పెద్దను
కూటికి నే పేదను... గుణములలో పెద్దను
సంకల్పము నాకు ధనము సాహసమే నా బలం
ఏనాటికో ఈ గరీబు... కాకపోడు నవాబు
ఏనాటికో ఈ గరీబు... కాకపోడు నవాబు
అంతవరకు నేనొక నిరంతర సంచారి

నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి

ఈ పాటకు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సాహిత్యాన్ని అందించగా, ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడారు. ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీతాన్ని సమకూర్చారు.

కామెంట్‌లు లేవు: