9, ఏప్రిల్ 2010, శుక్రవారం

సిరిమల్లె నీవే(పంతులమ్మ )

బాలు గారి గొప్పదనం గురించి ఎం చెప్పను.. అలాగే సాహిత్యం కుడా అదిరిపోయే పాట ... మొన్నో సారి నిద్ర వస్తుండగా తను తెలుగు రేడియో పాటలు పెడితే ఈ పాట వింటూ నిద్ర అయ్యాను .అద్భుతంగా ఉంటుంది సంగీతం ...




సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే

||సిరిమల్లె నీవే ||

ఎలదేటి పాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లె
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే.. వనదేవతల్లే
పున్నాగపూలే.. సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే

||సిరిమల్లె నీవే ||

మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే

అనురాగమల్లే.. సుమగీతమల్లే
నన్నల్లుకోవే.. నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే

కామెంట్‌లు లేవు: