14, మే 2010, శుక్రవారం

ముత్యమంతా పసుపు(ముత్యాల ముగ్గు)

ప్లిచ్ .. ఈ పాట వీడియో దొరకలేదు ..నాకు చాల ఇష్టం అయిన పాట


ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ(2)
ముద్దు మురిపాలొలకు ముంగిళ్ళలోనా
మూడు పువ్వులారు కాయల్లు కాయ

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ

ఆరనైదోతనము ఏ చోటనుండు
అరుగులలికే వారి అరచేతనుండు(2)

తీరైన సంపద ఎవరింటనుండు (2)
దినదినము ముగ్గున్న ముంగిళ్ళనుండు

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ

కోటలో తులిసమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచే వారి కొంగు బంగారు(2)

గోవు మలచ్మికి కోటి దండాలు (2)
కోరినంత పాడి నిండు కడవల్లు

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ

మొగడు మెచ్చిన చాల కాపురం లోన
మొగలి పూల గాలి ముత్యాల వాన (2)

ఇంటి ఇల్లలికి ఎంత సౌభాగ్యం(2)
ఇంటిల్లిపాదికి అంత వైభొగం

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ
ముద్దు మురిపాలొలకు ముంగిళ్ళలోనా
మూడు పువ్వులారు కాయల్లు కాయ

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ

2 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

నేస్తం ! అప్పట్లో ఓ బ్లాగరు నన్నడిగారు జాజిపూలు నేస్తం ......మీరూ ఒకటే కదా అని ! అలా ఎందుకన్నారో తెలీదు కాని ఇప్పుడు మీకు నచ్చిన పాటల లిస్టు చూస్తుంటే మాత్రం ఈ బ్లాగ్ నాదే అనిపిస్తుంది.నాకిష్టమైనవే మీకిష్టమైనవీనూ :)

నేస్తం చెప్పారు...

పరిమళం గారు అలా అన్నారా :) అయితే మన టేస్ట్ లు ఒకటే అన్నమాట